గూగుల్ పై మస్క్ సంచలన ఆరోపణలు
ప్రముఖ సెర్చ్ ఇంజన్ ఆప్షన్ గూగుల్ సంస్థపై టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశారు.. ఎక్స్ వేదికగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గూగుల్ సంస్థ జోక్యం చేసుకుంటుంది..
రిపబ్లిక్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై గూగుల్ సంస్థ ఏమైన నిషేధం విధించిందా..?అని ప్రశ్నించారు.
గూగుల్ లో డోనాల్డ్ అని టైప్ చేసి చూస్తే సజెషన్లో డోనాల్డ్ డక్,డోనాల్డ్ రీగన్ అని వస్తున్నది.. ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ ఈ ఆరోపణలు చేశారు.. ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో ఆ సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఆయన హెచ్చారించాడు.