చూస్కోవాలి కదామ్మా!. అన్నీ బిగినింగ్ మిస్టేక్స్..?
ఈరోజు ఆదివారం ఉదయం నుండే ఇటు మీడియా అటు సోషల్ మీడియా మరోవైపు రాజకీయ పార్టీల్లో మారుమ్రోగిన అంశం జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసుల దాడులు.. ఈ దాడుల్లో విదేశీ మద్యం ఉంది. పార్టీకి అనుమతి లేదని మాత్రమే పోలీసులు కేసు నమోదు చేశారు. ఎక్కడ కూడా డ్రగ్స్ అనవాళ్లు ఉన్నట్లు.. వాడినట్లు చెప్పలేదు. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేసే విధంగా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్.. అటు మరో ప్రతిపక్ష పార్టీ బీజేపీ తమ నోటికి తాళం తీసినట్లుగా ఉదయం నుండి ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ దగ్గర నుండి అటు ఎంపీ రఘునందన్ రావు వరకు.. ఇంకో పక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు మీడియా ఒకటే హెడ్డింగ్స్ జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలో సంచలన విషయాలు అని ప్రచారం..
కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ వీళ్లకు నేనేమి తక్కువన్నట్లు ఇంకో అడుగు ముందుకేసి ఆ పార్టీలో డ్రగ్స్ వాడారని మీడియాలో కథనాలు వచ్చాయి. నాకు సమాచారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మాజీ మంత్రి కేటీఆర్ బామ్మర్ధిని తప్పించేందుకే డ్రగ్స్ లేదని స్టోరీలు అల్లుతున్నారని విమర్శించారు. అయితే ఇవన్నీ పక్కనెడితే పోలీసులు నమోదు చేసిన కేసులోక్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళు ఆరోపిస్తున్న అంశాలు ఒక్కటి నిజం కాదు. ఇంకొకటి అధికారంలోకి వచ్చిన రోజు నుండి తనపై.. తన చుట్టూ ఉన్న వారిపై ఇరవై నాలుగంటల నిఘా పెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి కేటీఆర్ నిత్యం చెబుతూనే ఉన్నారు.
నిన్న కాక మొన్న మా ఫోన్లన్నీ ట్యాప్ చేస్తున్నారు అని కూడా అన్నారు. అది అన్నారో లేదో రెండు రోజులకే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ. రేవ్ పార్టీ జరుగుతుందని తమ అధికార బలాన్ని ఉపయోగించి ఇటు అధికార పార్టీ.. అటు బీజేపీ పార్టీ ఆరోపిస్తే నమ్మడానికి తెలంగాణ సమాజం కానీ మిగతావర్గాలు కానీ అంత తెలివి తక్కువాళ్ళేమి కాదు . ఎందుకంటే జన్వాడ ఫామ్ హౌస్ ఎంత వివాదస్పదమైందో అందరికి ఎరుకే. అలాంటిది మాజీ మంత్రి కేటీఆర్ ఇలాంటి పనులను ఎంకరేజ్ చేస్తారంటే ఆయన గురించి తెల్సినవాళ్లు.. బీఆర్ఎస్ వాళ్లతో పాటు ఎవరూ నమ్మరు.. ఇలాంటి వాటిలో బీఆర్ఎస్ & కేటీఆర్ ను ఇరికిచ్చే పనిలో అన్ని చూస్కోవాలి కదామ్మా.. ఇవన్నీ బిగినింగ్ మిస్టేక్స్ అని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఫ్యామిలి గ్యాదరింగ్.. డ్రగ్స్ లేవు.. కేవలం విదేశీ మద్యం ఉందని డిపార్ట్మెంటే క్లియరెన్స్ ఇచ్చాక ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ మీడియా ఈ అత్యుత్సాహాం ఎందుకో అని మేధావులు , రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు.