జగన్ కు అండగా నాగబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కి జనసేన నాయకుడు… ప్రముఖ నటుడు నాగబాబు అండగా నిలిచారు.. చదవడానికి వింతగా ఉన్నా కానీ ఇదే నిజమండోయ్.. అలా అని నాగబాబు ఏమి రాజకీయంగానో.. పార్టీ మారి వైసీపీలో ఏమి చేరడం లేదు.. అసలు సంగతి ఏమిటంటే 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై కోడికత్తితో దాడి జరిగిన సంఘటన మనకు గుర్తు ఉండే ఉంటది..
ఆ సంఘటనతో జగన్ అధికారంలోకి కూడా వచ్చాడని అప్పట్లో ఆరోపణలు ఉన్నాయి.. తాజాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి కూడా మనకు తెల్సిందే.. అప్పటి సంఘటనను గుర్తు చేస్తూ నాగబాబు జనసేన కూటమి ప్రభుత్వం వైఎస్ జగన్మొహాన్ రెడ్డికి న్యాయం చేయాలని ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు..
ఎక్స్ వేదికగా నాగబాబు స్పందిస్తూ” పాపం అమాయకుడైన జగన్ మోహన్ రెడ్డిపై అప్పట్లో శ్రీను అనే వ్యక్తి కోడి కత్తితో హత్య చేయడానికి ప్రయత్నించాడు.. అధికారంలోకి వచ్చిన జగన్ అధికారంతో బిజీబిజీ గా ఉండటం వల్ల ఆ కేసును విచారణ చేయించలేకపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఫ్రీగా ఉన్నారు కాబట్టి దయచేసి ఆ నిందితుడ్ని విచారించి జగన్ కు న్యాయం చేయాలని కోరుతున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు.