సినిమాలే వద్దనుకున్నాను
ఎంతో ఘనంగా జరిగిన ANR నేషనల్ అవార్డ్ వేడుకల్లో సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవితో తనకున్న అనుబంధాన్ని మన్మధుడు..స్టార్ సీనియర్ అగ్రనటుడు నాగార్జున పంచుకున్నారు.
నాగ్ మాట్లాడుతూ’1985లో నేను సినిమాల్లోకి వద్దామనుకునే సమయంలో మెగాస్టార్ చిరంజీవి మా అన్నపూర్ణ స్టూడియోలోనే ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. మా నాన్న నన్ను పిలిచి వెళ్లి డాన్స్ ఎలా చేస్తున్నారో చూడమన్నారు.
అక్కడకి వెళ్లి చిరంజీవి డాన్స్ చూశాక ఆ గ్రేస్, కరిష్మా చూశాక ఈయనలాగా మనం డాన్స్ చేయగలుగుతామా..?.. వద్దులే వేరే దారి వెతుక్కుందాం అనుకుని బయటికొచ్చేశాను ‘ అని తెలిపారు.