విభజనపై నారాయణ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. దివంగత మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి వేడుకల సందర్బంగా నారాయణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ బతికుండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని అయన అభిప్రాయపడ్డారు.
నాడు ‘వైఎస్ ఉన్నప్పుడు ఒకవేళ తెలంగాణ వచ్చినా టీఆర్ఎస్ మాత్రం ఉండేది కాదు. రాజకీయాల్లో వైఎస్సార్ విలక్షణమైన వ్యక్తి.
కాంగ్రెస్ నుంచి ఇబ్బందులు వచ్చినా అదే పార్టీలో కొనసాగారు. అందరికీ సహాయం చేసేందుకు ముందుండేవారు’ అని నారాయణ పేర్కొన్నారు.