రేవంత్ రెడ్డికి నారాయణ లేఖ

 రేవంత్ రెడ్డికి నారాయణ లేఖ

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ లేఖ రాశారు. తెలంగాణ లోని వరంగల్ జిల్లాకు చెందిన వెన్నెల అనే అమ్మాయి అమెరికా అట్లాంటాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలు పాలై అక్కడ ఆసుపత్రిలో ఉందని ఆ లేఖలో నారాయణ తెలిపారు.

నిరుపేద కుటుంబానికి చెందిన వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందించాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. వెన్నెలను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విన్నవించారు.

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది చదువులకోసం విదేశాలకు వెళ్తున్నారని వివరించారు. విదేశాల్లో చదువు కుంటున్న విద్యార్థుల కోసం ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నారాయణ కోరారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *