సత్తా చాటిన నితీశ్ రెడ్డి..!
ఆసీస్ జట్టుతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాను మరోకసారి ఆదుకున్నాడు నితీశ్ రెడ్డి. మూడో రోజు లంచ్ బ్రేక్ సమయానికి ఏడు వికెట్లను కోల్పోయి భారత్ 244 పరుగులు చేసింది.
ఇండియా ఇంకా 230 పరుగులు వెనకబడి ఉంది. యువబ్యాటర్ నితీశ్ రెడ్డి అరవై ఒక్క బంతుల్లో నలబై పరుగులు నాటౌట్ తో భారత్ ను మరోసారి ఆదుకున్నాడు.
వీటిలో ఓ సిక్సర్ , మూడు ఫోర్లు ఉన్నాయి. మూడో రోజు ఉదయం టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ ప్రారంభమైనాక పంత్ (28), జడేజా (17) ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేకపోయారు.