సర్కారు బడిలో నో అడ్మిషన్ బోర్డు
వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నియోజకవర్గ కేంద్రమైన సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తుంది.
సకల వసతులతో విద్యాబుద్దులు నేర్పిస్తున్న ఈ స్కూల్‌లో సీటు కోసం విద్యార్థులు పోటీపడుతున్నారు.1200 మంది విద్యార్థుల చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్‌లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
దీంతో గురువారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చినవారికి సీటు కేటాయిస్తారు.