హాలీ డే రోజు అరెస్ట్ లేంటి..?

No arrest on Holi Day..?
తెలంగాణ రాష్ట్రంలో ఏడాది కిందట అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన నేతల అరెస్టులపై పలువురు రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల్లో సైతం నిరాశ నిస్పృహాను వ్యక్తం చేస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. ఇటీవల జరిగిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ నుండి.. తాజాగా హుజుర్ బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ దాక పలువురు బీఆర్ఎస్ నేతల అరెస్టులపై భిన్న స్వరం విన్పిస్తుంది.
తాజాగా పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంలో ప్రవర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం తీరును.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శైలీని పలువురు తప్పు పడుతున్నారు.హాలిడే రోజుల్లోనే బీఆర్ఎస్ నేతలను అరెస్టులు చేయడం సాంప్రదాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకుంది.ప్రతిపక్ష పార్టీ నేతలే టార్గెట్‌గా అరెస్టులు.. కేసులు నమోదు చేయడం ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఏడాది పాలనలో ప్రజా సమస్యలు డైవర్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి స్కీమ్ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.సమీక్ష పేరుతో పండుగ రోజు అరెస్టుల మీద ప్రణాళికలు రచించిన సీఎం రేవంత్ రెడ్డి అంటూ బీఆర్ఎస్ నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు గత సంవత్సరం దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙన ప్రదర్శనలు అన్నీ ప్రజల ముందు ఎక్స్పోజ్ చేసిన బిఆర్ఎస్ సోషల్ మీడియాను ఈసారి మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్‌తో డైవర్ట్ చేద్దాం అని ఓ సమీక్ష సమావేశంలో చర్చించుకున్నట్టు సమాచారం.ఈ రోజు ఉదయం ప్లాన్ బెడిసి కొట్టినందున సాయంత్రం టీవీ డిబేట్‌లో ఉన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్లు వినాలా అని..మీ స్వార్ధ రాజకీయాల కోసం మమ్మల్ని బలిచేస్తున్నారు అంటూ డిపార్ట్మెంట్ లో సైతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి.
ఇప్పటికే ప్రజలు ఛీ కొడుతున్నారు అంటూ కొందరు సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా తమ ఆవేదనను తమ శ్రేయోభిలాషుల దగ్గర వ్యక్తం చేస్తున్నట్లు బయట టాక్ విన్పిస్తుంది. ఇప్పటికైన ప్రభుత్వం.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్ లు.. అక్రమ కేసులు పెట్టడం బంద్ పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం పై దృష్టి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
