గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాసం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే. మేయర్ విజయలక్ష్మీ తండ్రి మాజీ ఎంపీ .. సీనియర్ రాజకీయ నాయకులైన కేకే కూడా హస్తం గూటికి చేరారు. దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం గురించి గ్రేటర్ కు చెందిన ఎమ్మెల్యేలు.. కార్పోరేటర్లతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మంగళవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో గ్రేటర్ అభివృద్ధికి ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు.. బకాయిలతో పాటు పలు అంశాల గురించి చర్చించారు. అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ” గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పై అవిశ్వాసం గురించి సమావేశంలో చర్చించాము.
అభివృద్ధి, పథకాల అమలుపై సుధీర్ఘంగా చర్చించాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న ఇండ్లను, పథకాలను మేము అడ్డుకోము.. కాంగ్రెస్ గీత దాటితే మేము కూడా దాటుతాము అని తేల్చి చెప్పారు.
