జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్మోతె శ్రీలతారెడ్డి తన భర్త మరియు సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు శోభన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.
దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ లపై అవిశ్వాస తీర్మానం పెట్టడం పై శనివారం జరగబోయే పార్టీ మీటింగ్ నిర్ణయం తీసుకుంటామని మాజీ మంత్రి.. సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కౌన్సిల్ లో మెజార్టీ సభ్యులు బీఆర్ఎస్ నుండే ఉన్నారు.
నగరంలో ప్రజలు ఎదుర్కుంటున్న ప్రజా సమస్యలపై కమిషనర్‌కి వినతిపత్రం ఇచ్చాము.. నగరంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల నిర్మాణాలు ఆగిపోయాయి.దరఖాస్తు చేసుకున్నవారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి.GHMC కౌన్సిల్‌లో అడుగుతున్న మా సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలేదు అని ఆయన అన్నారు.
