నాగార్జున కు పరువు లేదా…?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ,యువహీరో.. ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య, మాజీ కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత లపై అసత్య ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం చేకూరేలా వ్యాఖ్యానించారు మంత్రి కొండా సురేఖ..
దీంతో ఆమె పై అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్ట దావా కేసు వేసిన సంగతి తెల్సిందే. ఈ కేసు గురించి సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ ” అసలు పరువే లేని అక్కినేని నాగార్జున పరువు నష్ట దావా కేసు వేయడం హాస్యాస్పదంగా ఉంది.
బిగ్ బాస్ ద్వారా పరువు పొగొట్టుకున్న ఆయన మంత్రి కొండా సురేఖ పై దావా వేయడం ఏంటని ఆక్షేపించారు. సమంత లాంటి వాళ్లు కేసు వేసినా ఓ ఆర్ధం .. పరామర్ధం ఉంటుంది అని అన్నారు. సురేఖ క్షమాపణలు తెలిపిన తర్వాత కూడా కోర్టుకు వెళ్లడం సరికాదని ఆయన సూచించారు.