“జయం రవి” కాదు ఇక రవి మోహాన్..!

తమిళ ఇండస్ట్రీకి చెందిన జయం రవి తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఇక నుండి తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహాన్ అని పిలవాలని సూచించారు.
జయం మూవీ రీమేక్ లో నటించడంతో ఆయన పేరు జయం రవి గా ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఇక నుండి తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. జయం రవి ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై ఈరోజు సినిమా హాళ్లల్లో విడుదల కానున్నది.
