రైతుబంధు సొమ్ము వెనక్కి ఇచ్చేయాలని నోటీసులు
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిల్లాకు చెందిన పోచారం గ్రామంలో ఉండే ఎం. యాదగిరి రెడ్డికి రైతుబంధు ద్వారా పొందిన రూ.16 లక్షలను తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు పంపారు.
యాదగిరి రెడ్డి తన 33 ఎకరాల వ్యవసాయ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించినప్పటికీ రెవెన్యూ అధికారులు వ్యవసాయ భూమి నుండి NALA (Non Agriculture Land)గా మార్చకపోవడంతో ఆయన రైతుబంధు పొందారు.
ఈ తరహాలో రైతు బంధు తీసుకున్న వారందరికీ ఆ డబ్బులు అన్ని తిరిగి చెల్లించాలని అధికారులు నోటీసులు పంపిస్తున్నారు.