ఎన్టీఆర్ షాకింగ్ డిసెషన్..!

Boy heroine play with NTR..!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది కాబట్టి, అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నారు అని ఆయన టీమ్ విడుదల చేశారు..
ఈ నేపథ్యంలో, అభిమానులు తనను కలుసుకోవడానికి పాదయాత్ర వంటివి చేయరాదని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. తన అభిమానుల ఆనందమే కాదు, వారి సంక్షేమం కూడా తనకు అత్యంత ప్రధానం అని ఆయన మరోసారి స్పష్టం చేస్తున్నారు.
