ఒక మ్యాచ్.. 3గ్గురు కెప్టెన్లు..!
క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు.
అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది..
సహజంగా ఏ జట్టుకైన ఒక కెప్టెన్ ఉంటారు.అయితే సిడ్ని మ్యాచ్ లో భారత జట్టుకు ముగ్గురు కెప్టెన్ లు గా వ్యవహరించారు..అవును నిజమే సిడ్ని టెస్ట్ కు ముందు భారత కేప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా ఈ మ్యాచ్ నుండి తప్పుకున్నాడు.అయితే అతని స్థానంలో బూమ్రా ను ఈ మ్యాచ్ కు కేప్టెన్ గా వ్యవహరించారు.
అయితే మ్యాచ్ మద్యలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో రోహిత్ ఆటగాళ్ళ వద్దకు వచ్చి కేప్టెన్ తరహాలో సలహాలు సూచనలు చేసారు..అలాగే మ్యాచ్ మద్యలో బూమ్రా ఫీల్డ్ లోంచి కాసేపు భయటకు వెల్లడంతో కాసేపు కొహ్లీ కేప్టెన్ గా వ్యవహరించారు.ఇలా సిడ్ని టెస్ట్ లో భారత జట్టుకు రోహిత్,బూమ్రా,విరాట్ కొహ్లీ రూపంలో ముగ్గురు కేప్టెన్ లు అంటూ నేటిజన్లు చర్చించుకుంటున్నారు.