వన్ నేషన్.. వన్ ఎలక్షన్ దిశగా అడుగులు..!

దేశంలో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నిర్వహించాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాము.
వన్ నేషన్. వన్ ఎలక్షన్ దిశగా కీలక అడుగులు పడుతున్నాయి అని పార్లమెంట్ ప్రసంగంలో ఆమె తెలిపారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోచ్చినట్లు వెల్లడించారు.
త్వరలోనే దేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. దేశంలో ఉన్న యువతకు.. రైతులు.. మహిళలు.. పేదలకు ప్రాధాన్యతమిస్తూ ఉంటాయని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు.రేపు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెల్సిందే.
