బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే
బీఆర్ఎస్ కు చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారు.. త్వరలోనే బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని అన్నారు ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల విషయంలో బీఆర్ఎస్ నేతల మాటలు హాస్యస్పదంగా ఉన్నాయి.
అసలు ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను చేర్చుకోవడం మొదలెట్టిందే కేసీఆర్. కేసీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే వ్యభిచారమా అని ఆయన ప్రశ్నించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ కేటీఆర్ హారీష్ రావు సురేష్ రెడ్డిలకు ఢిల్లీలో ఏమి పని .. ఏడు నెలల కాంగ్రెస్ పాలనను నచ్చి.. రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్దిని చూసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు అని ఐలయ్య అన్నారు.