పద్మారావు గౌడ్ కు గుండెపోటు..!

బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ డిప్యూటీ స్పీకర్ .. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.. ఉత్తరాఖండ్ రాష్ట్ర రాజధాని మహానగరమైన డెహ్రాడూన్ పర్యటనలో ఆయన ఉన్నారు.
ఈ సమయంలోనే ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుకు ఈరోజు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది.దీంతో అప్రమత్తమైన పద్మారావు కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
తక్షణమే స్పందించిన వైద్యులు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌కు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ రాత్రికి పద్మారావు సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.
