డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నూతన మంత్రివర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవి ఖరారైనట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి ప్రధాన కారణమైన పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత గౌరవం తగ్గకుండా మరెవరికీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వటం లేదని సమాచారం.
జనసేనాని ఒక్కరికే ఈ పదవి కట్టబెట్టనున్నట్లు టాక్. 2014లో టీడీపీ హయాంలో ఇద్దరు, 2019లో వైసీపీ హయాంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలుగా కొనసాగారు.
మరోవైపు అటు టీడీపీకి 19, జనసేనకు 3, బీజేపీకి 2 మంత్రి పదవులు దక్కే అవకాశముంది అని వార్త.