పవన్ కళ్యాణ్ కు అస్వస్థత
ప్రముఖ సినీ నటుడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర జ్వరం… దగ్గుతో ఆయన బాధపడుతున్నారు.
గత నెల ముప్పై తారీఖున పిఠాపురం లో జరిగిన సభ తర్వాత పవన్ కళ్యాణ్ నీరసపడినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. దీంతో పవన్ అక్కడ నుండి స్పెషల్ హెలికాప్టర్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ చేరుకున్నారు.
నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకోనున్నట్లు సమాచారం.. మరోవైపు పవన్ తదుపరి పర్యటన షెడ్యూల్ ఖరారు చేసేందుకు జనసైనికులు కసరత్తు చేస్తున్నారు.