పవన్ కళ్యాణ్ అనే నేను
ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు.
ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు.
అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.