అభిమానులపై పవన్ కళ్యాణ్ అసహానం…!
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై మరోకసారి తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కడప జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతల దాడిలో గాయపడ్డ
ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు.
అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అభిమానులు ఓజీ ఓజీ అంటూ భారీగా స్లోగన్స్ ఇచ్చారు. అక్కడున్న నేతలతో పాటు అధికారులు ఎంతగా వారించిన కానీ అభిమానులు తగ్గేదేలే అనేంతగా స్లోగన్స్ ఇచ్చారు.
దీంతో ఒక్కసారిగా అసహానానికి గురైన పవన్ కళ్యాణ్ అభిమానులపై అగ్రహాం వ్యక్తం చేశారు. దాంతో పవన్ ఏంటయ్యా మీరు.. ఎక్కడ ఏమి మాట్లాడాలో తెల్వదు.. ఎక్కడ ఏ స్లోగన్స్ ఇవ్వాలో తెలియదు.. ఓజీ ఓజీ అంటూ మీ స్లోగన్స్ ఏంటి.. నేను ఉన్న పరిస్థితి ఏంటి.. మీరు ఇచ్చే నినాదాలు ఏంటీ … పక్కకు రండి అని అన్నారు.