పల్నాడు లో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళవరం పల్నాడు జిల్లా మాచవరం మండలంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు.
అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సరస్వతి పవర్ ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయాంలో వచ్చింది. అప్పట్లో భూములిచ్చిన రైతుల బిడ్డలకు ఉపాధి కల్పిస్తాము.. ఉద్యోగాలు ఇస్తాము అని నమ్మించి లాక్కున్నారు. మాట విననోళ్ళపై పెట్రోల్ బాంబులేసి చంపేశారు.
సరస్వతి పవర్ ప్రాజెక్టు బాధిత కుటుంబాలకు అండగా ఉండటానికి వచ్చాను.. రైతులకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఇష్టం లేకపోయిన బలవంతంగా భూములు లాక్కున్నారు అని కూటమి ప్రభుత్వానికి పిర్యాదులు అందాయి. అందుకే విచారణకు ఆదేశించాను అని అన్నారు.