దిల్ రాజు కు పవన్ స్వీట్ వార్నింగ్..!

Trolling on Deputy CM – Cases registered..!
రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు.
ఈరోజు ఈవెంట్ విజయవంతం చేయడానికి వేలాది మంది యువత వచ్చారు. సినిమా రిలీజ్ రోజు ప్లెక్సీలు కట్టేవాళ్లు.. సినిమాను సూపర్ డూపర్ హిట్ చేసే అభిమానులకు మనం ఎంతోకొంత తిరిగివ్వాలి. దిల్ రాజ్ గారు మీరు తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా ఉన్నారు. ఆంధ్రాను తక్కువ చూపు చూడకండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ మీరు ప్రత్యేక చొరవ తీసుకుని ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాల్లో .. రాయలసీమలోనూ స్టూడియోలు పెట్టండి.. యువతకు స్టంట్ లలో శిక్షణ ఇప్పించండి. సంగీతం లో ఇప్పించండి. స్క్రీన్ ప్లే రాయడంలో.. కథలు రాయడంలో.. యువతకు.. అభిమానులకు శిక్షణ ఇప్పించండి. ఎంఎం కిరవాణి, థమన్ లాంటి వాళ్ళతో సంగీతం క్లాసులు.. త్రివిక్రమ్ ,ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాళ్లతో దర్శకత్వ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిల్ రాజును కోరారు.
