నటుడుకి అండగా పవన్ కళ్యాణ్..!
Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు పిష్ వెంకట్ కు అండగా నిలిచారు. నటుడు పిష్ వెంకట్ పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుండి పలు ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెల్సిందే.
ఈ క్రమంలో పిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారి సమస్యలను విన్న పవన్ తక్షణ సాయం కింద పిష్ వెంకట్ ఆసుపత్రుల ఖర్చులకు రెండు లక్షలు ఆర్థిక సాయం అందించారు.
అన్ని రకాలుగా అండగా ఉంటానని పవన్ భరోసా ఇచ్చినట్లు పిష్ వెంకట్ ఓ వీడియోను విడుదల చేశారు. పవన్ తో గబ్బర్ సింగ్ లాంటి పలు చిత్రాల్లో పిష్ వెంకట్ నటించారు.