పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన వైసీపీ మాజీ మంత్రి…?

 పవన్ కళ్యాణ్ ఇజ్జత్ తీసిన వైసీపీ మాజీ మంత్రి…?

Pawan’s key comments about Gautam Adani

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన దీపం -2 కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ” అవాక్కులు చవాక్కులు పేలుస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు.. కార్యకర్తలను తొక్కి నార తీస్తా అని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటరిచ్చారు.

ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షులుగా దేవినేని అవినాష్ పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ” సీట్లు లేకపోయిన నోళ్లు లేపే బ్యాచ్ పవన్ కళ్యాణ్ ది. అధికారం ఉంటేనే జనసేన నేతలు..పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అధికారం ఉన్న లేకపోయిన ఎప్పుడు ఒకేలా ఉంటూ నోళ్లు తెరిచి ప్రజల తరపున ప్రశ్నించే తత్వమున్న బ్యాచ్ వైసీపీది.

ఎదుటీవాళ్ల దగ్గర కత్తులున్న కానీ ఏ మాత్రం బెదరకుండా నిజాన్ని నిక్కసగా చెప్పే బ్యాచ్ మాది. ఎవరి జెండాలను మోయాలని తన పార్టీ కార్యకర్తలను.. నేతలను ఆదేశించే నాయకుడు పవన్ కళ్యాణ్.. పట్టుకున్న జెండాను దించకుండా.. నమ్ముకున్న నాయకుడి కోసం పని చేయమని చెప్పే నాయకుడు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.

తమ నాయకుడు సీఎం అవుతాడని జనసైనికులు కలలు కంటుంటే.. మావల్లనే మీ నాయకుడు డిప్యూటీ సీఎం అయ్యాడని మిత్రపక్ష పార్టీ నేతలు జనసైనికులను మానసికంగా వేధిస్తున్నరు. ఇప్పటికైన జనసేనాని తన స్థాయికి తగ్గట్లు నడుచుకోవాలని షేర్ని నాని హెచ్చరించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *