పుష్ప ఇష్యూ పై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందిస్తూ సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట సంఘటనలో హీరో ఒక్కడ్ని బాధ్యుడ్ని చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది.
ఈ సమస్యలో హీరోని ఒంటర్ని చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో మర్యాద విలువ ఇస్తుంది. సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహాం ఇచ్చారు. ఏమి చేయాలన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కత్తికి రెండువైపులా పదులా తయారైంది.
ఘటన జరిగిన రెండో రోజే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉంది. క్షమాపణలు చెప్పడానికి చాలా మార్గాలు ఉన్నాయి. సంధ్య లాంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని ఆయన అన్నారు.