పవన్ అంటే లోకల్ కాదు నేషనల్..!
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటి చేసిన అన్ని ఎమ్మెల్యే.. ఎంపీ స్థానాల్లో గెలుపొంది పోటి చేసిన అన్ని స్థానాల్లో విజయంతో వందకు వందశాతం సక్సెస్ రేటును సాధించిన పార్టీగా అవతరించిన సంగతి తెల్సిందే..
తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున ప్రచారం చేసిన పదకొండు స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులే గెలుపొందారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు.
పదకొండుకు పదకొండు స్థానాల్లో గెలుపొందటమే కాకుండా నాందేడ్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కూటమి అభ్యర్థి గెలవడంతో ఆయన మరోసారి వందశాతం స్ట్రైక్ రేట్ ను సాధించారు అని పీకే ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. దీంతో జనసేనాని.. ఏపీ ఉప ముఖ్యమంత్రి ‘పవన్ అంటే లోకల్ అనుకుంటివా.. నేషనల్’ అంటూ వారయ్ సందడి చేస్తున్నారు.