పవన్ నీతులే చెబుతాడు..?. చేతలు ఉండవు..?.

 పవన్ నీతులే చెబుతాడు..?. చేతలు ఉండవు..?.

Loading

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏపీలో రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి హాజరై వెనుదిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటి.. యాంకర్.. అధికార ప్రతినిధి శ్యామల తన ట్విట్టర్ లో స్పందిస్తూ “డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్ప‌డం వ‌ర‌కే.. ఆచ‌ర‌ణ‌లో ఉండ‌వు.

గేమ్ ఛేంజ‌ర్ మెగా ఈవెంట్‌కు హాజ‌రైన ఇద్ద‌రు అభిమానులు రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోతే ఈ ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేస్తూ నెపాన్ని గ‌త ప్ర‌భుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు . కాకినాడ‌-రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్ర‌మైంద‌ని మీకు ముందుగానే తెలిసిన‌ప్పుడు ఈవెంట్‌కి మీరు ప‌ర్మిష‌న్ ఎందుకు ఇచ్చారు స‌ర్ SEIZE THE ROAD… అనాలి క‌దా? సినిమాల‌కు రండి.

చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈల‌లు వేసి గోల చెయ్యండి అంటూ యువ‌త‌ను రెచ్చ‌గొడుతూ మీరు మాట్లాడిన మాట‌లు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాట‌లేనా మీ కార‌ణంగా ఇద్ద‌రు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోతో క‌నీసం వెళ్లి ప‌రామ‌ర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయ‌కుల ప్రాణాలు బ‌లి చేస్తున్నారా ? అని ఆమె ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *