డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!
ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు.
మరోవైపు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు.
టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేస్తే తనను కూడా శిక్షించాలని అనేకసార్లు చెప్పానన్నారు.