గౌతమ్ అదానీ గురించి పవన్ కీలక వ్యాఖ్యలు
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే. దీంతో ఆయనపై.. ఆయన కంపెనీపై అమెరికాలో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం వీటిపై విచారణ జరుగుతుంది.
ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం గౌతమ్ అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం అంశంపై జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఆయన స్పందిస్తూ గతం ప్రభుత్వం అవకతవకలకు పాల్పడింది. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయం సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందన్నది తెలుసుకోవాలి. మరింత లోతుగా అధ్యయనం చేశాకే నిర్ణయం తీసుకోవాలి అని ఆయన అన్నారు.