కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి షాకిచ్చిన ఖమ్మం ప్రజలు
కేంద్ర మంత్రి.. తెలంగాణ బీజేపీ శాఖ అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి,మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్,చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, స్థానిక మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కల్సి ఖమ్మం జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఖమ్మంలోని దంసలాపురంలో వరద బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం పరామర్శించారు. ఈ నేపథ్యంలో బాధితుల నుండి మిశ్రమ స్పందన వెల్లడవ్వడంతో అవాక్కవడం వారి వంతైంది.
వరదలతో వర్షాలతో అతలాకుతలమైన మేము ఉన్నామో.. చచ్చామో అని చూడటానికి వచ్చారా..?. మాకు కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెల్వదు.. ఇక్కడ ముగ్గురు మంత్రులున్నారు .. వాళ్లు ఏమి చేస్తున్నారో తెలియదు.. ఎందుకు వచ్చారు.. ఫోటోలకోసమా.. పబ్లిసీటీ కోసమా అని బాధితులు ప్రశ్నించారు. వెంటనే తేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బదులిస్తూ బాధితులను అన్ని రకాలుగా అండగా ఉంటాము. మీకు ఎంతమేర నష్టం వాటిల్లిందని తెలుస్కోవడానికి స్వయంగా నేనే వచ్చాను..
మీరు చెబితే మీ నుండి సమాచారం సేకరించడమే కాకుండా ప్రభుత్వం నుండి నివేదికలను తీసుకోని వరద సాయం చేయిస్తాను.. నిన్న మా కేంద్ర మంత్రులే స్వయంగా మీ జిల్లాకు వచ్చారు. ఆ నివేదికలు కేంద్రానికి పంపారు. మీకు త్వరలోనే అందరికి సాయం చేస్తాము. అండగా ఉంటాము..ధైర్యంగా ఉంటాము అని చెప్పే ప్రయత్నం చేశారు.
ఊహించని పరిణామం ఎదురవ్వడంతో వడం తప్పా చేసేది ఏమి లేకపోవడంతో మంత్రుల బృందం అక్కడ నుండి వెళ్ళిపోయారు. నిన్న కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురుకాకపోవడం విశేషం.. కేవలం బాధితులు కేంద్ర మంత్రి కాళ్లపై పడి వేడుకోవడం తప్పా .