ప్రతి రోజూ ఈ పప్పును గుప్పెడు తింటే…?
ప్రతిరోజూ పిస్తా పప్పును గుప్పెడు తింటే చాలా ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాలో విటమిన్ ఈ,విటమిన్ బీ6 వంటి విటమిన్లు పుష్కళంగా ఉంటాయి.
ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.గుండెను శక్తివంతంగా చేసేందుకు సహాయపడతాయి.
పిస్తాలో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లా కరిగిస్తాయి.మలబద్ధక సమస్యను తగ్గిస్తాయి.రోజూ వీటిని తినడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది.మెరుస్తూ ఉంటుంది.