రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు.
ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది.
ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందుతుంది..