అల్లు అర్జున్ కు పోలీసులు షాక్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు.
తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో అల్లు అర్జున్ పరామర్శిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పోలీసులు మరోకసారి అల్లు ఇంటికెళ్లారు.
హీరో శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లకూడదని బన్నీ మేనేజర్ కు నోటీసులు అందజేశారు.బెయిల్ షరతులను సైతం పాటించాలని సూచించడం గమనార్హం .. మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు బన్నీ ఈరోజు చిక్కడపల్లి పీఎస్ లో విచారణకు హజరు కావాల్సి ఉంది.