ప్రియాంకా గాంధీ ఘన విజయం
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ ఘన విజయం సాధించారు. ఆమె ఇప్పటికే 4,03,966 ఓట్ల మెజారిటీ సాధించారు.
దీంతో ఆమె గెలుపు లాంఛనంగా మారింది. తర్వాతి స్థానాల్లో CPI, BJP ఉన్నాయి. గత ఎన్నికల్లో 3.64 లక్షల ఓట్ల మెజారిటీతో రాహుల్ MPగా గెలిచిన విషయం తెలిసిందే.
ఆయన రాజీనామా చేయడంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో తాజాగా ప్రియాంక గెలిచారు.మరోవైపు రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యవన్ నిలిచారు.