ప్రియాంక గాంధీ రికార్డు
వయనాడ్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ప్రియాంక గాంధీ ఈరోజు ఉదయం నుండి వెలువడుతున్న ఫలితాల్లో ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు ప్రియాంక గాంధీ వయనాడ్ లో మూడు లక్షల నలబై రెండు వేల ఓట్ల మెజార్టీతో ఉన్నట్లు తెలుస్తుంది.
రెండో స్థానంలో సీపీఐ అభ్యర్థి సత్యన్ మోకెరి ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే స్థానం నుండి గెలుపొందిన సోదరుడు రాహుల్ గాంధీ మూడు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీ సాధించారు. తాజాగా ఆ రికార్డును బీట్ చేసే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.