లాభం వాళ్లకు..! భారం ప్రజలకు..?-రేవంత్ రెడ్డి రూటే సపరేట్..!.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పెద్దల నుండి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క లు కూడా వాళ్లకు కొన్ని ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువభారత సమీకృత పాఠశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయించిన సంగతి మనకు తెల్సిందే.
ఇందుకు ఒక్కొక్క పాఠశాల నిర్మాణానికి సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది సర్కారు. అందుకు తగ్గ ప్రతిపాదనలు.. బ్లూ ప్రింట్ లను సైతం ఇప్పటికే రూపొందించింది కూడా.. తాజాగా నిన్న గురువారం జరిగిన భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ మహోత్తర కార్యానికి మీతరపున కూడా సాయం అందించాలి. సినిమా టిక్కెట్లపై సెస్ ఛార్జీలు పెంచుతాము. అందుకు మీరంతా సహాకరించాలి. కావాలంటే మీరు టిక్కెట్ల ధరలు పెంచుకోవచ్చు. మీరు ప్రజాసేవ కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకోవాలి అని సూచించారంట.
అందుకు వాళ్లు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. ఈ నిర్ణయంపై మేధావులు, ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న యువభారత సమీకృత పాఠశాలల నిర్మాణం అభినందించదగ్గ నిర్ణయమే అయిన కానీ ఇలా సెస్ ఛార్జీలు పెంచి సినిమా చూసే వాళ్లపై భారం పెంచడం ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు.
ముందు నుండి తెలంగాణ ప్రజలపై భారం వేస్తూ వచ్చిన రేవంత్ సర్కారు తాజా నిర్ణయంతో మరో రూపంలో భారాన్ని మోపనున్నారని వారు విమర్శిస్తున్నారు. ఎందుకంటే సినిమా చూసేది ఎక్కువ శాతం బడుగుబలహీన వర్గాలే.. సినిమా టికెట్ల ధరలను పెంచుకోవడానికి అనుమతిచ్చి సినిమా వాళ్లు వేల కోట్లను సంపాదించుకోవడానికి మార్గం సుగమం చేస్తున్నారు. ఆ భారమేమో ప్రజలపైనా.. సామాన్యులపైనా అని వారు ప్రశ్నిస్తున్నారు.