యువతకు పూరీ జగన్నాథ్ సందేశం..!
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువతకు ముఖ్యంగా మహిళలకు తన ప్యాడ్ కాడ్ లో ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే.
పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను.
భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని ఆయన పేర్కొన్నారు.