పుష్ప -2 మరో రికార్డు..!

Pushpa 2 All Time Record
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా హీరోయిన్ గా.. సునీల్ , రావు రమేష్, జగపతి బాబు, అజయ్, అనసూయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా మూవీగా విడుదలైన మూవీ పుష్ప 2.
ఈ చిత్రం ఎన్ని వివాదాలకు దారితీసిందో అంతే ఘనవిజయం సాధించింది. ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది ఈ మూవీ. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ విడుదలైన సంగతి తెల్సిందే.
దీంతో చాలా చోట్ల హౌజ్ పుల్ బోర్డులు మళ్లీ దర్శనమిస్తున్నాయి. రీలోడెడ్ తర్వాత విడుదలైన నలబై ఐదో రోజు కూడా ఓ సినిమాకు హౌజ్ ఫుల్ పడటం ఇదే తొలిసారి సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. మొత్తం ఇరవై నిమిషాల నిడివి మళ్లీ కొత్తగా యాడ్ చేశారు.
