పుష్ప -2 టికెట్ ధరలు భారీగా పెంపు..!
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీక మందన్నా హీరోయిన్ గా సునీల్,అనసూయ ,రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికి తెల్సిందే. ఈ చిత్రానికి సీక్వెల్ గా పుష్ప -2 డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానుల ముందుకు రానున్నది.
ఈ క్రమంలో తెలంగాణలో పుష్ప -2 చిత్రానికి టికెట్ల ధరలను భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.డిసెంబర్ నాలుగో తారీఖు రాత్రి 9.30,ఆర్ధరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షో లకు ఒకే చెప్పింది. వీటికి సంబంధించిన టికెట్ల ధరలను సింగిల్ స్క్రీన్ ,మల్టీఫ్లెక్సీలలో రూ.800లుగా ఖరారు చేసింది.
డిసెంబర్ ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు సింగిల్ స్క్రీన్ రూ.150,మల్టీఫ్లెక్సీలలో రూ.200ల చొప్పున పెంపునకు అనుమతిచ్చింది. అంతేకాకుండా డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి పదహారు తారీకు వరకు సింగిల్ స్క్రీన్లలో రూ.105, మల్టీఫ్లెక్సీలలో రూ.150చొప్పున పెంపునకు అనుమతిచ్చింది.