పుష్ప – 2 ట్రైలర్ రికార్డు
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మీకా మందాన్న హీరోయిన్ గా నటించగా డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ పుష్ప – 2 . ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నిన్న పాట్నా వేదికగా విడుదల చేశారు.
నిన్న విడుదలైన ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ లో రికార్డు సృష్టించింది. రీలిజైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్ లో నలబై మిలియన్ల కంటే ఎక్కువమంది రియల్ టైమ్స్ వ్యూస్ తో పాటు 1.4మిలియన్ల లైక్స్ సాధించిన చిత్రంగా రికార్డూను సొంతం చేసుకుంది.
ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్ అదిరిపోవడం.. సినీ అభిమానులు రిపీట్ మోడ్ లో చూడటంతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.