రాహుల్ గాంధీ.. లగచర్లపై మాట్లాడరా…?
తెలంగాణలో కొనసాగుతున్న కాంగ్రెస్ నియంతృత్వ పాలనపై ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘మారణకాండ జరిగితేనే స్పందిస్తారా? దేశంలో తెలంగాణ లేదా?’ అని ఢిల్లీ వేదికగా నిప్పులు చెరిగారు.
లగచర్ల బాధితులు సోమవారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
అక్రమంగా అరెస్టు చేసిన తమవాళ్లను విడుదల చేయాలని, తమను ప్రభుత్వ హింస నుంచి కాపాడాలని కన్నీటిపర్యంతమయ్యారు.లగచర్ల లో బలవంతపు భూ సేకరణ ఘటనను, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాల గురించి సవివరంగా వివరించారు.