సోషల్ మీడియాను ఊపేస్తున్న రాజమౌళి..!

పాన్ ఇండియా స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ పోస్టుతో మొత్తం సోషల్ మీడియానే షేక్ చేస్తుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు తో జక్కన్న ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైందనే సందేశాన్ని ఇస్తూ దర్శకుడు రాజమౌళి ఓ వీడియోను పోస్టు చేశారు.
ఆ వీడియోలో హీరో మహేష్ బాబు కు సంబంధించిన పాస్ పోర్టును లాగేసుకున్నట్లుగా సింహాన్ని బోన్ లో ఉంచినట్లుగా పోస్టు చేశారు. దీంతో సినిమా ప్రచార కార్యక్రమాల్లో దర్శకుడు జక్కన్న తర్వాతనే ఎవరైన అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
