సూసైడ్ కి సిద్ధమైన రాజేంద్రప్రసాద్..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. హీరో రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సినిమా కేరీర్ ప్రారంభంలో ఉండగా అవకాశాలు తక్కువగా వచ్చేవి.. చేతిలో పైసలు ఉండేవి కావు. మూడు నెలలు అన్నం తినలేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ” సినిమాల్లోకి వెళ్తానని ఇంట్లో చెప్పినప్పుడు నాన్నగారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.సినిమాల్లోకి వెళ్లాక ఫెయిల్ అయితే ఇంటికి తిరిగి రావోద్దని చెప్పారు.
ఒక దశలో సినిమాల్లో పాత్రలు రాక.. అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. చివరగా నిర్మాత పుండరీకాక్షయ్య కార్యాలయానికి వెళ్లాను. అక్కడ డబ్బింగ్ చెప్పే అవకాశం నాకు దక్కింది. దీంతో నా దశ మారిందని చెప్పారు.