ఆస్పత్రి నుండి రజినీకాంత్ డిశ్చార్జ్
నాలుగు రోజుల కిందట తీవ్రమైన కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నిన్న గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు.
ఆయన కడుపులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వైద్యులు స్టంట్ ను అమర్చారు.
ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. సూపర్ స్టార్ నటించిన వేట్టయాన్ ఈ నెల పదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్ములేపుతుంది.