11నెలల్లోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకతకు కారణాలు..?
ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలవుతుంది. ఈ పదకొండు నెలల్లోనే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై.. అటు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకతకు కారణం ఏంటని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న. ఈ ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిస్తూ ” తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలో తెలియదు. ప్రాజెక్టులు ఎలా పూర్తి చేయాలో పక్కా ప్రణాళికలను సిద్ధం చేయడం చేతకాదు. ప్రాజెక్టులు పూర్తి చేయాలి.. పెట్టుబడులు తెవాలంటే ఎంత కష్టపడాలి.
మా ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హారీష్ రావు ఇటు కాళేశ్వరం, అటు భక్తరామదాసు లాంటి ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎంత కష్టపడ్డారు. పెట్టుబడులు తీసుకురావడానికి నేను ఎన్ని సార్లు విదేశాలకెళ్లాను. ఎంతమందిని కలిశాను. మేము కరోనా సమయంలోనే రైతుబంధు డబ్బులు ఆపలేదు.. ఆసరా ఆపలేదు. అలాంటిది రైతుబంధు డబ్బులను ఆపారు. మేము ఆసరా ఎనాడు వేయకుండా లేము. వీళ్లోచ్చాక ఆసరా ఆగింది. కరెంటు కోతలు.. రైతులు రోడ్లకెక్కారు. ఉద్యోగులు సచివాలయం ముట్టడించారు. నిరుద్యోగ యువత ఆశోక నగర్ లో ఆర్ధరాత్రుళ్లు ధర్నాలు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనరు.. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా భూములను లాక్కుంటారు.
రైతులను మహిళలను చూడకుండా అరెస్ట్ లు చేస్తారు. మేము ప్రాజెక్టులు కట్టిన సమయంలో రైతులకు ఎంత పరిహారం ఇచ్చామో తెలుసుకుంటే మంచిది. మేము మూసీ సుందరీకరణకు పదహారు వేల కోట్లతో ఓ ప్రణాళికను సిద్ధం చేశాము.. వీళ్లోచ్చి లక్ష యాబై వేల కోట్లు అంటున్నారు. మిగతా లక్ష ముప్పై ఆరు వేల కోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్తాయి మరి. మూసీ ప్రక్షాళన కు డీపీఆర్ లేదంటారు. డీపీఆర్ లేనప్పుడు ఎందుకు ముందుకెళ్తున్నారు. మూసీ నది పక్కన పేదల ఇండ్లను కూల్చివేసి వాటి స్థానంలో భవంతులు కడితే సుగంధ వాసన వస్తుందా..? ఈ ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు లేవు.. వ్యూహాలు లేవు.. గుడ్డెద్దు చేలో పడినట్లు ముందుకెళ్తున్నప్పుడు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా అభినందనలు వస్తాయా అని ప్రశ్నించారు.