రెండో పెళ్లిపై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
రేణు దేశాయ్ ఎవరికి పరిచయం అక్కర్లేని పేరు.. బద్రీ ,జాని మూవీలతో తెలుగు ప్రేక్షకులకే కాదు ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేనాని పవన్ కళ్యాణ్ కు దగ్గరైన బక్కపలచు భామ.. ఇటీవల వీరిద్దరూ విడిపోయిన కానీ ఎక్కడ కూడా వివాదాలకు పోకుండా తన వ్యక్తిగత జీవితాన్ని ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మ రేణు దేశాయ్..
అలాంటి రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలని ఒకానోక టైంలో ఎంగెజ్మెంట్ కూడా చేసుకున్నారు.. అయితే ఏమైందో ఏమో కానీ అది క్యాన్సిల్ చేసుకున్నారు. తాజాగా తను రెండో పెళ్ళి చేసుకోకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ” నా చిన్నప్పుడు అమ్మాయి పుట్టిందని మా నాన్న గారు నన్ను తాకడానికి కూడా ఇష్టపడలేదు..
ఆ రోజుల్లో అమ్మాయి పుడితే చంపేసేవారు. కానీ మా తల్లిదండ్రులు విద్యావంతులు కాబట్టి ఆ పని చేయలేదు.. పేరుకు అమ్మ నాన్న నాతో ఉన్న కానీ వారి ప్రేమానురాగాలను నేను దక్కించుకోలేకపోయాను.. పవన్ తో విడిపోయిన కూడా వాళ్లు నా దగ్గరకు రాలేదు.. నన్ను దగ్గరకు తీసుకోలేదు.. అలాంటి పరిస్థితులు నా పిల్లలకు రాకూడదని నిర్ణయించుకోని రెండో పెళ్లి చేసుకోలేదని” ఆమె వివరించారు.