మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్సోళ్లకు రిజర్వ్ బ్యాంకా…?
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇక్కడకి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్.. బీఆర్ఎస్సోళ్లకు ఏటీఎం లెక్క మారింది అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ అక్షరాల ఎనబై మూడు వేల కోట్లు మాత్రమే.
ఎనబై మూడు వేల కోట్లకి లక్ష కోట్ల అవినీతి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అంత అవినీతి జరిగి ఉంటే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయ్యేది కాదు. పోలవరం ప్రాజెక్టు లా మిగిలిపోయేది.. ఒక్క ఎకరాకు కూడా సాగునీళ్లు అందేవి కావు.
మరి మూసీ ప్రక్షాళన అని లక్షా యాబై వేల కోట్లు అంటున్నారు.. మూసీ కాంగ్రెస్సోళ్ళకు రిజర్వ్ బ్యాంకా అని మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు.